విజయనగరం రైలు ప్రమాదంపై రైల్వేశాఖ కీలక ప్రకటన

విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్ మధ్య రెండు రైళ్లు

Update: 2023-10-29 17:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్ మధ్య రెండు రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనపై వాల్తేరు డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ స్పందించారు. విశాఖ-రాయగడ ప్యాసింజర్ పట్టాలు తప్పిందని, చీకటి కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందని అన్నారు. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

అటు రాయగడ ప్యాసింజర్‌ను వెనుక నుంచి పలాస ప్యాసింజర్ ఢీకొట్టింది. సిగ్నల్ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో విశాఖ-రాయగడ ప్యాసింజర్ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం జరుగుతోంది. రైల్వే మైన్‌లైన్‌లో దుర్ఘటనతో రైల్వే విద్యుత్ వైర్లు తెగిపడినట్లు తెలుస్తోంది. అధికారులు సహాయక చర్యలను చేపడుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒక బోగీని కట్ చేసి క్షతగాత్రులను సిబ్బంది బయటకు తీస్తున్నారు. 3 బోగీల్లో క్షతగాత్రులను బయటకు తీసిన తర్వాత రైళ్లను పునరుద్దరించనున్నారు.


Similar News