మీడియాను ప్రశ్నిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ హాట్ టాపిక్‌గా మారాడు. గతంలో ఆయన చేసిన ట్వీట్లపై కేసులు నమోదు కాగా ఆయనను విచారించేందుకు పోలీసులు వెతుకుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ హాట్ టాపిక్‌గా మారాడు. గతంలో ఆయన చేసిన ట్వీట్లపై కేసులు నమోదు కాగా ఆయనను విచారించేందుకు పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో తాను ఎక్కడికి పారిపోలేదని.. హైదరాబాద్ లోని తన డెన్ లోనే ఉన్నానని ఈ రోజు మధ్యాహ్నం చెప్పుకొచ్చాడు. కాగా ఆదివారం రాత్రి.. తనపై ప్రచారం అవుతున్న వార్తలపై ఆయన ట్విట్టర్ ద్వారా మీడియా చానల్‌లను సూటిగా ప్రశ్నించారు. ఆర్జీవీ తన ట్వీట్‌లో "నా ఈ సాధారణ ప్రశ్న మొత్తం మీడియాకు.. నాకు సంబంధించిన అవాస్తవ వార్తలు ప్రచారం చేస్తున్న వారికి, పోలీసులు నన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటే ఇప్పటి వరకు నా ఆర్జీవీ డెన్ ఆఫీసుకు రాలేదని ఎందుకు? నేను నా డెన్ లో ఒక్క పోలీసు అధికారిని కూడా చూడలేదు.
నా అరెస్ట్‌కు వారెంట్ ఉందని పోలీసుల బృందాలు నా కోసం వివిధ రాష్ట్రాల్లో వెతుకుతున్నాయని చూపిస్తున్నారు. ఆ అన్ని ఛానళ్లు నాకు అవాస్తవంగా చెప్పి, నేను చెప్పిన మాటలు తప్పుగా చెప్పి, అప్రామాణిక సంఘటనలను వివరించి, ప్రజలను తప్పు విశ్వసించమని ప్రయత్నిస్తున్నాయి. నేను మీడియా సంస్థలు, వారి యజమానులు, నిర్దిష్ట యాంకర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. నా టీమ్ అన్ని ఆధారాలు, పత్రాలు సేకరించి, మెల్లగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు పంపుతుంది ఆర్జీవీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.