Nimmala Ramanaidu:రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి:మంత్రి నిమ్మల
పాలకొల్లు పోలీస్ స్టేషన్ సమీపంలో పాలకొల్లు- పూలపల్లి బైపాస్ రహదారిని కలుపుతూ నిర్మిస్తున్న రహదారి పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించారు.
దిశ, పాలకొల్లు: పాలకొల్లు పోలీస్ స్టేషన్ సమీపంలో పాలకొల్లు- పూలపల్లి బైపాస్ రహదారిని కలుపుతూ నిర్మిస్తున్న రహదారి పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసరమైన ఈ రహదారి గతంలో పెద్ద పెద్ద గోతులతో నడవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉండేదన్నారు. నేడు ఈ రహదారి నిర్మాణంతో పలు ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మంత్రి రామానాయుడు తెలిపారు. ఆయన వెంట పెచ్చెట్టి బాబు, రావూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.