తెలంగాణలో బీజేపీ ఆఫీస్ పై రాళ్లతో దాడి.. స్పందించిన పురందేశ్వరి
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ(Telangana) బీజేపీ కార్యాలయం(BJP Office) వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ(Telangana) బీజేపీ కార్యాలయం(BJP Office) వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక గాంధీ పై ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు(BJP Leaders) యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్ పై రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ దాడి పై బీజేపీ రాష్ట్ర(ఆంధ్రప్రదేశ్) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purendaswari) స్పందించారు. కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. బీజేపీ నేతలపై దాడి చేయడం ఖండిస్తున్నామన్నారు. చట్టపరంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నామని పురందేశ్వరి తెలిపారు.