కోడెల శివరాంకు నిరసన సెగ
కోడెల శివరాంకు నిరసన సెగ తగిలింది. తన తండ్రి విగ్రహం ఏర్పాటుకు సిద్ధమవుతున్న కోడెల శివరాంకు ముప్పాళ్ల మండలం రుద్రవరంలో కొందరు బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: కోడెల శివరాంకు నిరసన సెగ తగిలింది. తన తండ్రి విగ్రహం ఏర్పాటుకు సిద్ధమవుతున్న కోడెల శివరాంకు ముప్పాళ్ల మండలం రుద్రవరంలో కొందరు బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు. విగ్రహావిష్కరణ అడ్డుకుంటామని రుద్రవరంలో ఫ్లెక్సీలు వెలిసాయి. తమకు ఇవ్వాల్సిన డబ్బులను కోడెల శివరాం ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. తమ డబ్బులు తమకు ఇచ్చి రుద్రవరంలో విగ్రాహావిష్కరణకు రావాలని లేకపోతే అడ్డుకుంటామని హెచ్చిరంచారు.