Sensational News: ఏపీలో ఆ పార్టీదే విజయం.. తేల్చేసిన రాజకీయ వ్యూహకర్త పీకే

వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

Update: 2024-03-03 14:46 GMT
Sensational News: ఏపీలో ఆ పార్టీదే విజయం.. తేల్చేసిన రాజకీయ వ్యూహకర్త పీకే
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతే విజయమని తేల్చేశారు. వైఎస్ జగన్ ఓటమి తప్పదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్యాలెస్‌లో కూర్చుకుని పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారని.. దాని వల్ల ఓట్లు పడవని వెల్లడించారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలని చెప్పారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. జగన్ ఈసారి ఏం చేసినా గెలవడం కష్టమని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్.. ఏపీ ఎన్నికలపై స్పందించారు.


కాగా  ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు.  2019 ఎన్నికల్లో సీఎం జగన్ అత్యధిక సీట్లతో గెలవబోతున్నారని ఆ సమయంలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే 151  సీట్లలో వైసీపీ గెలిచి ప్రభంజనం సృష్టించింది. అంతేకాదు కోల్ కతా, ఢిల్లీ ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ అంచనాలు కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోందని చెప్పడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. 

Tags:    

Similar News