ఆపరేషన్ కంబోడియా:.. మరో ఏజెంట్ అరెస్ట్

మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టుల పర్వాన్ని పోలీసులు ముమ్మరం చేశారు...

Update: 2024-06-02 15:28 GMT

దిశ, వెబ్ డెస్క్: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టుల పర్వాన్ని పోలీసులు ముమ్మరం చేశారు. విశాఖలో మరో ఏజెంట్ మురళిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో 30 మంది యువతీయువకులను మురళి కంబోడియాకు పంపారు. అయితే అక్కడికి వెళ్లిన వీళ్లను మరో ఏజెంట్లు చైనా కంపెనీలకు  అమ్మేశారు. వీరితో స్రైబర్ మోసాలు చేయించారు. అంతేకాదు తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులు తాళ్లలేక విశాఖకు చెందిన వ్యక్తి కంబోడియా నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మానవ అక్రమ రవాణా కేసు వ్యవహారం బయటపడింది. ఇప్పటి వరకూ 12 మంది ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక కంబోడియాలో చిక్కుకున్న యువతీ యువకులను భారత్‌కు రప్పిస్తున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన పలువురు స్వగ్రామాలకు చేరుకున్నారు. 


Similar News