5 గంటలు కంటిన్యూగా నిల్చున్న పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్‌ ఎమోషనల్ (వీడియో)

జనసేన పార్టీ 10వ అవర్భావ సభ మంగళవారం ఏపీలోని మచిలీపట్నంలో అట్టహాసంగా జరిగింది. లక్షలాది అభిమానులు, కార్యకర్తలతో సుల్తాన్‌నగరం మారుమోగింది.

Update: 2023-03-15 05:31 GMT
5 గంటలు కంటిన్యూగా నిల్చున్న పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్‌ ఎమోషనల్ (వీడియో)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ 10వ అవర్భావ సభ మంగళవారం ఏపీలోని మచిలీపట్నంలో అట్టహాసంగా జరిగింది. లక్షలాది అభిమానులు, కార్యకర్తలతో సుల్తాన్‌నగరం మారుమోగింది. అయితే, అంతకుముందు జనసేన పార్టీ ప్రచార రథమైన వారాహి వాహనంపై విజయవాడ మీదగా మచిలీపట్టణానికి దాదాపుగా 100 కిలోమీటర్లు మేర రోడ్ షో నిర్వహించారు. అంతేగాక, జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున వారాహి వాహనం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. వారాహి వాహనంపై పవన్ కల్యాణ్ ఫస్ట్ రోడ్ షో సక్సెస్‌ అని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రోడ్ షో సందర్భంగా ఓ విషయం తలుచుకొని ఫ్యాన్స్‌ ఎమోషనల్ అవుతున్నారు. దాదాపు 100 కిలోమీటర్ల మేర రోడ్ షో చేయడంతో పవన్ కల్యాణ్ సుమారు 5 గంటల పాటు కంటిన్యూగా నిల్చొని, ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూనే ఉన్నారు. దీంతో ‘నీ ఓపికకు, సహనానికి దండం, నువ్వు మా దేవుడివి అన్నయ్య’ అంటూ ఫ్యాన్స్‌ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. మరోపక్క.. వారాహి వాహనం రోడ్లపైకి ఎలా వస్తుందో అని సవాల్ చేసిన చోటే అదే వాహనంపై ర్యాలీగా వెళ్లామని వైసీపీ నేతలపై జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు.

Tags:    

Similar News