ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు.. వైసీపీ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

ఈ రోజు ఆంద్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సీఈసీనిచంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిశారు.

Update: 2024-01-09 09:32 GMT

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు ఆంద్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సీఈసీని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అధికారం లోకి వచ్చాక అక్రమ కేసులు కుప్పలు తిప్పలుగా పెరిగిపోయాయని.. వైసీపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. సీఈసీ బృందం విజయవాడ వచ్చి సమావేశం ఏర్పాటు చేయగా.. తాను, చంద్రబాబు నాయుడు కలిసి వెళ్లి సీఈసీ బృందాని కలిశామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారని.. ఈ నేపథ్యంలో సీఈసీ ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. కేవలం చంద్రగిరిలో దాదాపు లక్ష పైచిలుకు దొంగ ఓట్లు నమోదయ్యాయని తెలిపిన ఆయన..  లక్ష పైచిలుకు నమోదైన దొంగ ఓట్లలో కొన్ని ఆమోదం కూడా జరిగాయని పేర్కొన్నారు.  

Tags:    

Similar News