నా కోసం నిలబడ్డారు.. మద్దతివ్వడం నా బాధ్యత.. బాబుకు పవన్ కళ్యాణ్ ఫుల్ సపోర్ట్
చంద్రబాబుకు రిమాండ్ విధించడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండటంపై
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబుకు రిమాండ్ విధించడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబుకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బాబుకు ఎప్పటికీ తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఇదే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని అన్నారు.
'విశాఖ గొడవ విషయంలో చంద్రబాబు నాకు మద్దతు తెలిపారు. తిరిగి నేను స్పందించడం అనేది సంస్కారం. నా కోసం నిలబడిన వ్యక్తికి నేను మద్దతు ఇవ్వడం మన బాధ్యత.. నేను చంద్రబాబును కలిసేందుకు వస్తానని ప్రచారం చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టించిందే వైసీపీ నేతలు' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్‌పై పవన్ విమర్శలు చేశారు. రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి జగన్ అని, రీచెస్ట్ సీఎం.. కానీ ఏం పనిచేశాడో తెలియదన్నారు. ప్రతిఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని,