జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు: జనసేనాని ఫైర్

సీఎం జగన్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇప్పటిదాకా పవన్ కల్యాణ్‌లో శాంతి, మంచితనం మాత్రేమ చూశారని.. ఇకపై మరో పవన్ కల్యాణ్‌ను చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-02-28 14:28 GMT
జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు: జనసేనాని ఫైర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇప్పటిదాకా పవన్ కల్యాణ్‌లో శాంతి, మంచితనం మాత్రేమ చూశారని.. ఇకపై మరో పవన్ కల్యాణ్‌ను చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు యుద్ధం అంటే ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. సిద్ధం.. సిద్ధం అంటున్న జగన్‌కు ఎన్నికల్లో యుద్ధం ఇద్దామని పిలుపునిచ్చారు. వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండని.. ప్రజలపై దాడి చేస్తే మక్కెలు ఇరగొట్టి మడత మంచంలో పడేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నమ్మిన అందరిని మోసం చేసిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని ధ్వజమెత్తారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రోడ్డు బాగున్నాయని పగటి కలలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

సీఎం జగన్ ఇచ్చేది చేయూత కాదు చేతివాటమని సెటైర్ వేశారు. జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వ్యూహాలు రచిస్తాం, జగన్ కోటలు బద్దలు కొడతామని అన్నారు. సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. కోట్లు వచ్చే మార్గాలు వదులుకోని మీ కోసం వచ్చానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ మరోసారి స్పష్టం చేశారు.


Read More..

మక్కీలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెట్టేస్తా: పవన్ కల్యాణ్

Tags:    

Similar News