కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్
దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం వరద బాధిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
దిశ, వెబ్‌డెస్క్: దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం వరద బాధిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. బుడమేరును గత ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ప్రాజెక్ట్‌ల విషయంలో వైసీపీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యక్తిగతంగా తాను రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఇప్పటివరకు జూ.ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి, విశ్వక్ సేన్ రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షలు, రూ.15 లక్షల చొప్పున సిద్దూ జొన్నలగడ్డ రూ. 30 లక్షలు, రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ, రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం ప్రకటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ, ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అశ్వినీదత్ ప్రకటించారు.