వీడిన సస్పెన్స్.. పవన్ కల్యాణ్‌కు కేటాయించిన శాఖలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటిన విషయం తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది.

Update: 2024-06-13 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటిన విషయం తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది. మొత్తం 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. అధినేతతో సహా పోటీ చేసిన అందరూ గెలుపొందారు. భారత దేశ చరిత్రలో పోటీ చేసిన అన్ని గెలిచి వందశాతం సక్సెస్ సాధించిన పార్టీగా జనసేన నిలిచింది. ఇదిలా ఉండగా.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కల్యాణ్‌కు ఏ శాఖలు ఇస్తారో అనే అందరిలో ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం ఈ ఉత్కంఠకు తెరవీడినట్లు తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌కు సివిల్ సప్లయిస్, కందుల దుర్గేష్‌కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. పవన్‌ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ శాఖల కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Similar News