నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికులకు పవన్ కీలక హామీ

నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక హామీ ఇచ్చారు...

Update: 2024-04-24 13:57 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎవరు నవ్వుతూ ఉన్న జగన్ చూడలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో చంద్రబాబుతో కలిసి కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నామన్నారు. కళ్లెదుట దారుణాలు జరుగుతుంటే చూడలేమని చెప్పారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలని, పరిశ్రమలు రావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. చంద్రబాబును జైలు పెట్టినా ఆయన కళ్లల్లో అధైర్యం కనిపించలేదని చెప్పారు. రాజకీయ పోరాటమే చంద్రబాబు తెలుసన్నారు. నెల్లమర్ల జూట్ మిట్ మూసివేతతో వేలమంది కార్మికుల రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో మాట్లాడి జూట్ మిల్లు ఓపెన్ కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులు పెరిగాయన్నారు. చంపావతి నది నుంచి ఇసుక దోపిడీ పెరిగిందని మండిపడ్డారు. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. బాబాయిపై గొడ్డలి వేటు గాయం కాదా..?... గులకాయి దెబ్బే గాయయా? అని పవన్ ప్రశ్నించారు. దళితుల పథకాలు మళ్లీ అమలు చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Read More...

మారిన అకీరా-ఆద్య ఇంటి పేరు.. నెట్టింట దుమారం రేపుతోన్న పవన్ కల్యాణ్ అఫిడవిట్ 

Tags:    

Similar News