హామీల అమలుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేష్
78వ స్వాతంత్ర్య వేడుకల వేళ మంత్రి నారా లోకేష్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన సమావేశంలో ప్రసంగించారు.
దిశ, వెబ్‌డెస్క్: 78వ స్వాతంత్ర్య వేడుకల వేళ మంత్రి నారా లోకేష్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన సమావేశంలో ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు మా లక్ష్యం అని.. ఇప్పటికే డీఎస్సీ కూడా ప్రకటించామని.. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లను ప్రారంభిస్తున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా భూసార పరీక్షలు జరుగుతున్నాయని.. ఉచిత ఇసుక, హామీ అమలు చేస్తున్నామని.. ఏపీని గంజాయి, డ్రగ్స్ ఫ్రీగా చేయాలన్న బాధ్యత తీసుకొని కలెక్టర్లు, పోలీసులు, ఇతర ఉన్నతాదికారుల సహాయంతో ముందుకు సాగుతున్నామని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.