సింగ్‌నగర్‌కు పొంచి ఉన్న ముప్పు.. ఖాళీ చేస్తున్న వరద బాధితులు
విజయవాడ సింగ్‌నగర్‌కు మరోసారి ముప్పు ఉందని అధికారులు అంటున్నారు....
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సింగ్‌నగర్‌కు మరోసారి ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి బుడమేరు వాగు కట్ట తెగే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో సింగ్ నగర్ వాసులు పునరావాసానికి తరలివెళ్లిపోతున్నారు. అటు కృష్ణానది, బుడమేరు వాగు ఉధృతి తగ్గినా ఇంకా సింగ్‌నగర్‌కు కష్టాలు తప్పడంలేదు. ఇళ్లు, రోడ్లు నీటిలోనే ఉన్నాయి. నాలుగు రోజులుగా కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి బుడమేరు వాగు కట్ట తెగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో వరద బాధితులు సింగ్‌నగర్ కాలనీని ఖాళీ చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం మాత్రం అప్రమత్తంగా ఉంది. సింగ్‌నగర్ ప్రాంతంలో సహాయ చర్యలు అందిస్తోంది. వరదల్లో ఉన్న వాళ్లను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితులకు భోజనం, ఆహారం, పాలు అందిస్తున్నారు. అయితే ఇళ్లు, రోడ్లపై వరద నీరు అలాగే ఉండిపోవడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు.అటు బుడమేరు వాగు కట్ట తెగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలతో అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తోంది. విజయవాడలోని మరికొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గింది. బురద పేరుకుపోవడంతో ఫైర్ ఇంజిన్లతో శుభ్రం చేస్తున్నారు. యుద్ధ ప్రతిపదికన పారిశుధ్య పనులను చేపడుతున్నారు.