Breaking: చిక్కుల్లో మాజీ మంత్రి నాగార్జున.. మోసం చేశారని మహిళ ఫిర్యాదు

మాజీ మంత్రి మేరుగ నాగార్జున మోసం చేశారని గుంటూరు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేశారు..

Update: 2024-11-01 10:38 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి మేరుగ నాగార్జున(Former minister Meruga Nagarjuna) చిక్కుల్లో పడనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనను మోసం చేశారని ఓ మహిళ ఇచ్చిన తాడేపల్లి పోలీసులు(Tadepalli Police) విచారణ జరుపుతున్నారు. వైసీపీ(YCP) హయాంలో మేరుగ నాగార్జున మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో కాంట్రాక్టు పనుల పేరుతో రూ. 90 లక్షలు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ ఆరోపించారు. డబ్బులు ఇవ్వాలని నిలదీస్తే చంపేస్తానని బెదిరించారని ఆమె పేర్కొన్నారు. గిరిజన శాఖలో పని చేసిన ఉపాధ్యాయురాలని స్లో పాయిజన్ ద్వారా చంపేశామని, ఇప్పుడు అదే గతే పడుతుందని నాగార్జున పీఏ మురళి బెదిరించారని తెలిపారు. అంతేకాదు తనను లైంగికంగా కూడా వేధించాడని నాగర్జునపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజును ఆమె కోరారు. ఇక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రాథమికంగా విచారణ జరుపుతున్నారు. అనంతరం మేరుగ నాగార్జునపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


అయితే గత ప్రభుత్వ హయాంలో మేరుగ నాగార్జున ఇష్టారీతిన వ్యవహరించారని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయించారని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటి ప్రతిపక్షాల పట్ల కూడా నాగార్జున అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపణలు వినిపించాయి. తాజాగా మేరుగ నాగార్జునపై మహిళ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మేరుగ నాగార్జునపై కూటమి నాయకులు మండిపడుతున్నారు. వైసీపీ హయాంలో మహిళలపై చాలా చోట్ల అఘాయిత్యాలు జరిగాయని, కానీ అధికారం ఉండటంతో బాధితుల నోళ్లు నొక్కేశారని, ఇప్పుడు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని అంటున్నారు. మేరుగ నాగార్జున చేసిన అక్రమాలు, అఘాత్యాలకు శిక్ష తప్పదని హెచ్చస్తున్నారు. 


Similar News