ట్యూషన్ టీచర్ దారుణం.... విద్యార్థినికి మాయ మాటలు చెప్పి..!
కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం జరిగింది..
దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్ మాయల మాటలు చెప్పారు. తనతో ఉంటే జీవితం హ్యాపీగా గడిచిపోతోందని చెప్పాడు. దీంతో ఆ మాటలు నమ్మిన మైనర్ బాలిక టీచర్‌తో వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగింది. పత్తికొండకు చెందిన రాఘవేంద్ర ట్యూషన్ చెబుతూ స్థానికంగా ఉంటున్నారు. అయితే పట్టణానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని రాఘవేంద్ర దగ్గర ట్యూషన్‌కు చేరింది. దీంతో బాలికకు టీచర్ మాయ మాటలు చెప్పారు. భార్య ఇద్దరు పిల్లలున్న చంద్రశేఖర్ చెప్పిన మాయ మాటలు విన్న విద్యార్థినిని ఆయనతో వెళ్లిపోయింది. విద్యార్థిని ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. అయితే ట్యూషన్ టీచర్ రాఘవేంద్ర.. తమ బిడ్డను తీసుకెళ్లినట్లు తెలుసుకున్నారు. పత్తికొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు ఎక్కడున్నారో గుర్తించి తమకు అప్పగించాలని కోరుతున్నారు. తమ బిడ్డకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిన ట్యూషన్ టీచర్ రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.