మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.

Update: 2024-08-10 11:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని బ్రాండ్లను రద్దు చేసి.. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఈ పాలసీ ద్వారా సామాన్యులకు మంచి నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పాలసీని అమలు చేసేందుకు ఆరు రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న పాలసీలపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే వైసీపీ ప్రభుత్వం నాసిరకం మందును అధిక ధరలకు విక్రయించడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని చెప్పుకొచ్చారు. త్వరలో అందుబాటులోకి వచ్చే కొత్త మద్యం పాలసీ ద్వారా తమ ప్రభుత్వం ద్వారా ప్రజలకు నాణ్యతతో కూడిన లిక్కర్ అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. దీంతో అక్టోబర్ 1 నుంచి ఏపీ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తో పాటు కొత్త బ్రాండ్లు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Similar News