పోలవరం నిర్మాణానికి ఎన్డీఏ కట్టుబడి ఉంది: మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
పోలవరం నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: పోలవరం నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు పరిపాలించిన వైసీపీ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిందని ఫైర్ అయ్యారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను భారీ ఎత్తున మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలనే ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పోలవరం డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతిన్నదని కామెంట్ చేశారు. దానిని సరిచేసేందుకే నిపుణుల అభిప్రాయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.