Nara Rohit : తండ్రి రామ్మూర్తి నాయుడు మృతిపై నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్
తండ్రి రామ్మూర్తి నాయుడుNara Rammurthy Naidu మృతితో విషాదానికి లోనైన సినీ హీరో నారా రోహిత్(Nara Rohit) సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : తండ్రి రామ్మూర్తి నాయుడు(Nara Rammurthy Naidu ) మృతితో విషాదానికి లోనైన సినీ హీరో నారా రోహిత్(Nara Rohit) సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. నువ్వు ఒక గొప్ప ఫైటర్‌వి నాన్న.. నువ్వు నా మీద చూపించిన ప్రేమను నేను మర్చిపోలేను.. నాకు జీవితంలో ఎలా ఒడిదుడుగులను ఎదుర్కోవాలో నేర్పించావు. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అది నీ వలనే. నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు. మాకోసం నీ జీవితంలో ఎన్నో దూరం చేసుకున్నావు అలానే మరెన్నో త్యాగం చేసావు. నువ్వు చేసిన త్యాగలే మా జీవితాల్లో వెలుగులు నింపాయి. నాన్న నీతో గడిపిన జ్ఞాపకాలు నాకు ముఖ్యమైనవే. జీవితంలో ఎన్నో నేర్పించావు, జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకాలు నీతో ఉన్నాయి. జీవితాంతం వాటిని గుర్తు చేసుకుంటూ బ్రతికేస్తాను.. నిన్ను చాలా మిస్ అవుతున్నాం..ఇంకా ఏం చెప్పాలో తెలియడం లేదు.. బై నాన్న అంటూ ఎమోషనల్‌గా సెండ్ ఆఫ్ ఇచ్చాడు నారా రోహిత్.
నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లో అనారోగ్యంలో తుదిశ్వాస విడిచారు. స్వగ్రామం నారావారి పల్లిలో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.