Nara Lokesh: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ (Govt Junior Colleges)ల్లో చదివే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: గవర్నమెంట్ జూనియర్ కాలేజీ (Govt Junior Colleges)ల్లో చదివే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు త్వరలోనే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లుగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. అయితే, గతంలో టీడీపీ ప్రభుత్వం (TDP Government) హయాంలో ఈ పథకంలో అమల్లో ఉండేది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ (YCP Government) మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసింది.
ఆ పరిణామంతో ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా తగ్గి హాజరు శాతం పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కళాశాల్లో కూడా తిరిగి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టబోతున్నామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రకటించారు. పదో తరగతి పూర్తి చేసిన నిరుపేద విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తున్నారని.. మధ్యాహ్న భోజన పథకంతో వారంతా తిరిగి ఉన్నత చదువులను కొనసాగించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్తలో ఉన్న కళాశాలలను గుర్తించి వాటి మరమ్మతులు చేయించాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.