‘ఉగాది పంచాంగం’.. సీఎం చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి పండుగ నేపథ్యంలో అందరూ తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తున్నారు. ఈ ఉగాది(Ugadi) నుంచి తెలుగు సంవత్సరాది ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం వింటున్నారు.
అయితే ఈ ఉగాది సందర్భంగా ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ(Nagaphani Sharma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ(AP Government) ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో నాగఫణి శర్మని సీఎం చంద్రబాబు సత్కరించారు. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఆరోసారి కూడా రాష్ట్రానికి సీఎం అవుతారని పేర్కొన్నారు.
ఇప్పటికే నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి(Chief Minister)గా పదవీ బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు ఐదు, ఆరోవ సారి కూడా సీఎం పదవీ బాధ్యతలు చేపడతారని ఆయన జోస్యం చెప్పారు. అమరావతి(Amarawati)కి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదన్నారు. నూతన రాజధాని అమరావతి సీఎం చంద్రబాబు ఆశించిన విధంగా త్వరలోనే విశ్వనగరం అవుతుందన్నారు. ఎవరికైనా పదవులు రాకపోయినా కంగారు పడొద్దు. ఆలస్యమైనా అర్హత ఉన్నవారందరికీ పదవులు దక్కుతాయి అని నాగఫణి శర్మ వెల్లడించారు.