Breaking: జనసేన,టీడీపీ మధ్య చిచ్చు పెట్టిన నాగబాబు.. అసలేం జరిగింది..?
పార్టీ పొత్తు కుదిరినంత సులువుగా సీట్ల కేటాయింపులో ఇరు పార్టీలు ఓ ధాటిపైకి రాలేకున్నాయి.
దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు కలుపుకుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైకి చెప్తున్నా.. ఇరు పార్టీల అనుచరులు క్షేత్రస్థాయిలో కత్తులు దూసుకుంటున్నారు. పార్టీ పొత్తు కుదిరినంత సులువుగా సీట్ల కేటాయింపులో ఇరు పార్టీలు ఓ ధాటిపైకి రాలేకున్నాయి. ఇక తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేతకు గాని, ఆ పార్టీ నేతలకు గాని ఒక్కమాట కూడా చెప్పకుండా అరకు, మండపేట నియోజకవర్గ సీట్లను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.
కాగా ఈ ఘటన పై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు ధర్మం పక్కన పెట్టిందని తీవ్ర అసహనానికి గురైయ్యారు. ఇక టీడీపీ రెండు స్థానాలను ప్రకటించిన నేపథ్యంలో తాను రెండు స్థానాలను జనసేనకు కేటాయిస్తున్నట్లు రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించారు. దీనితో ఈ గొడవ ఇంతటితో సద్దుమనిగింది అనుకునేలోపు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనే న్యూటన్ థియరీని ఉదాహరణగా చూపిస్తూ ఓ ట్వీట్ చేశారు.
అయితే టీడీపీ రెండు స్థానాలను కేటాయించగా.. అందుకు ప్రతిచర్యగా జనసేన రెండు సీట్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీకి కౌంటర్ గా జనసేన కూడా రెండు స్థానాలను కేటాయించడాన్ని ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారనే చర్చ రాజకీయవర్గాల్లో జరిగింది. అయితే చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే నాగబాబు మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తాను పెట్టె ప్రతి పోస్ట్ కి ఏదోఒక అర్ధం ఉంటుందని అనుకోవద్దని.. తాను కొన్ని సార్లు ఇంఫర్మేషన్ న్ని పోస్ట్ చేస్తుంటాని.. ఈ రోజు ఫిజిక్స్ laws చేసాను..రేపు మరికొన్ని చేస్తాను అని బ్రాకెట్ లో వీటి గురించి ఆలోచించి గుమ్మడి కాయల దొంగలు అవ్వొద్దు అంటూ రాసుకొచ్చారు.
అయితే టీడీపీతో పొత్తులో ఉంటూనే తమ పట్టును చూపించుకునే నేపథ్యంలో ఈ ట్వీట్లు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రెండు సీట్లను కేటాయించిన నేపథ్యంలో జనసేన రెండు సీట్లను కేటాయించడం జరిగిందని టీడీపీ గొడవకు ముగింపు పలికింది. అయితే జనసేన మాత్రం ఇప్పటికి రెచ్చగొట్టే ధీరని అవలంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు అసహనానికి గురవుతున్నారు. టీడీపీ సామరస్యంగా వ్యవహరిస్తుంటే జనసేన ఇందుకు కవ్వింపు చర్యలు దిగుతోందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.