కూతురి వ్యాఖ్యలపై.. ముద్రగడ సెన్సేషనల్ కామెంట్స్!
జనసేన అధినత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం హాట్ టాపిక్ మారింది.
దిశ,వెబ్‌డెస్క్: జనసేన అధినత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పిఠాపురం హాట్ టాపిక్ మారింది. ఈ ఎన్నికల్లో పవన్‌ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటా అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ముద్రగడ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై తాజాగా తన కూతురు క్రాంతి స్పందించిన విషయం తెలిసిందే. వైసీపీ గెలుపు కోసం తమ తండ్రిని వాడుకుంటున్నారని, ఎన్నికలు అయిపోయాక ముద్రగడని పట్టించుకోరాని తమ కూతురు వ్యాఖ్యానించారు. పవన్ గెలుపు కోసమే తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా తన కూతురి కామెంట్లపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. నా కూతురు ఇప్పుడు నా ప్రాపర్టీ కాదు. పెళ్లి అయ్యేంత వరకే తను నా ప్రాపర్టీ అన్నారు. పెళ్లయ్యాక అత్తగారింటి ప్రాపర్టీ అన్నారు. పదవి కోసమే పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వచ్చారని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత హైదరాబాద్‌కి పరిమితమవుతారు. చంద్రబాబు అధికారం అనే ఆకలి తీర్చుకోవడానికి తాపత్రయపడుతున్నారు అని విమర్శించారు. ఎవరు బెదిరించినా బెదిరిపోను జగన్‌కి సేవకుడిగా ఉంటాను. నా కూతురికి నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. ఎవరి బెదిరింపులకు బెదిరిపోను అన్నారు.