Suspended:ముదివేడు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్

కురబలకోట మండలం లోని ముదివేడు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్ అయ్యారు.

Update: 2024-07-20 10:07 GMT

దిశ,రాయచోటి:కురబలకోట మండలం లోని ముదివేడు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్ అయ్యారు. అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ముదివేడు వద్ద ఉండే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రెండు రోజుల క్రితం 9వ తరగతి చదివే ముగ్గురు మైనర్ బాలికలు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ రఫియా పర్వీన్, హిందీ టీచర్ గౌసియా మస్తానీ, ఏఎన్ఎం భాను, అకౌంటెంట్‌లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


Similar News