కోడిపందాలను ప్రారంభించిన ఎంపీ రఘురామ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది కోడిపందాలు.

Update: 2024-01-14 06:09 GMT
కోడిపందాలను ప్రారంభించిన ఎంపీ రఘురామ..
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది కోడిపందాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాల్లో కోడిపందాలు లేకుండా సంక్రాంతి పూర్తి కాదు. కోడిపందాలు చట్టరీత్యా నేరం అని హై కోర్టు ఇన్ని సార్లు ఆదేశాలు ఇచ్చిన ఆ జిల్లాల్లో ఎవరు ఆ దేశాలను ఖాతరు చెయ్యరు. ప్రతి సంవత్సరం నిర్వహించినట్టే ఈ ఏడాది కూడా పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో సాంప్రదాయ కోడిపందాలను నిర్వహించారు. కాగా ఈ కోడిపందాలను నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తాను నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ బంధువులు, ఆప్తుల మధ్యలో పండుగను జరుపుకుంటున్నానని.. ఇలా పండుగను జరుపుకోవడం తనకు చాల స్నాతోషాన్ని అందించిందని తెలిపారు. అలానే రాబోయే రోజుల్లో ఎటువంటి ఆటంకాలు లేని సంక్రాంతిని చూడబోతున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరమని తెలిపారు.

సంక్రాంతి మూడు రోజులు కోడిపందాలు నిర్వహించడం అక్కడ ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఇక సంక్రాంతి సాంప్రదాయంలో కోడి పందాలు కూడా భాగమేనని తెలిపారు. అయితే కోడి పందాల బెట్టింగులకు తాను వ్యతిరేకమని.. అలాంటి బెట్టింగులను తాను ప్రోత్సహించనని తెలిపారు. అలానే బెట్టింగుల పేరుతో వేసే కోడి పందాలను అడ్డుకోవాల్సిందిగా రఘురామ కృష్ణంరాజు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News