కేశినేని చిన్ని ఓ క్రిమినల్.. సొంత సోదరుడిపై నాని సంచలన వ్యాఖ్యలు
విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిపై ఆయన సోదరుడు, ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిపై ఆయన సోదరుడు, ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేశినేని చిన్ని ఓ క్రిమినల్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిన్ని ఆర్థికంగా నష్టపోతే నేనే ఇంటికి తీసుకొచ్చానని.. అయినప్పటికీ అతడి బుద్ధి మారకపోవడంతో బయటకు పంపించానని అన్నారు. ఇక, 2019కి ముందు ఏపీలో అన్ని కంపెనీలు సూట్‌కేసు కంపెనీలేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు అనేక ఆరోపణలు చేశారని.. ఎన్నికల కోసం అదే బాబు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ భేష్ అంటున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ఎప్పుడూ వాస్తవాలు మాట్లాడరని.. తప్పుడు ఆరోపణలే చేస్తారని ఫైర్ అయ్యారు. కాగా, టీడీపీలో కీలక నేతగా ఉన్న కేశినేని నాని పార్టీ అధిష్టానం తీరు నచ్చాక ఎన్నికల ముందు అధికార వైసీపీలో చేరారు. వైసీపీలో జాయిన్ అయిన నానికి సీఎం జగన్ విజయవాడ వైసీపీ ఎంపీ టికెట్ కేటాయించారు. దీంతో విజయవాడలో బరిలో వైసీపీ, టీడీపీ నుండి అన్నదమ్ములు బరిలోకి దిగుతున్నారు. నాని, చిన్న మధ్య మాటల యుద్ధంతో విజయవాడ పాలిటిక్స్ సమ్మర్ హీట్‌ను మించి సెగలు రేపుతున్నాయి.