MP Elections : ఓటు వేసి భారీ గుడ్ న్యూస్ చెప్పేసిన KA పాల్..

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఏపీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Update: 2024-05-13 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఏపీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖపట్నం నుంచి ఆయన ఎంపీ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ఓటు వేసిన తర్వాత కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. తాను ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకున్నానో ప్రజలంతా అలానే ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఎడ్యుకేటెడ్, యూత్ ఓటింగ్ పర్సంటేజీ పెరిగిందన్నారు. ఇంట్లో ఉండొద్దని.. ఓటు వేయాలని రిక్వెస్ట్ చేశారు. చదువుకున్న వాళ్లు మళ్లీ వాళ్లే వస్తారని నిర్లక్ష్యం చేయవద్దని ఓటు హక్కును వినియోగించుకోవాలని.. మీతో పాటు నలుగురికి ఓటు వేయండి అని చెప్పాలని పిలుపునిచ్చారు. క్రిమినల్స్ కు ఓటు వేయొద్దని ఈ సందర్భంగా కేఏ పాల్ అన్నారు.  


Similar News