Breaking: ఆస్తుల కోసమే వివేకా హత్య.. సంచలన విషయం చెప్పిన అవినాశ్ రెడ్డి
ఆస్తుల కోసమే వివేకానందారెడ్డి హత్య జరిగిందని ఎంపీ అవినాశ్‌రెడ్డి తెలిపారు....
దిశ, వెబ్ డెస్క్: ఆస్తుల కోసమే వివేకానందారెడ్డి హత్య జరిగిందని ఎంపీ అవినాశ్‌రెడ్డి తెలిపారు. వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరయిన ఆయన అనంతరం సంచలన విషయాలు వెల్లడించారు. వివేకానందారెడ్డికి రెండో పెళ్లి జరిగిందని... వాళ్ల కొడుకును వారసుడిని చేయాలని అనుకున్నారని చెప్పారు. ఆస్తులను వారి పేరుపై రాయలనుకున్నారని అవినాశ్ రెడ్డి తెలిపారు. ఈ హత్య కేసులో వివేకా రెండో పెళ్లి అంశం కూడా కీలకమేనని వ్యాఖ్యానించారు. హత్య జరిగిన సమయంలో దొరికిన లెటర్ ఏమైందని అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. లెటర్ కూడా హత్యకు సాక్ష్యమేనని చెప్పారు. ఏ ఒక్కరికీ తాను గుండెపోటు అని చెప్పలేదన్నారు. తమ వైపు నుంచి ఏ తప్పులేదని, న్యాయపోరాటం చేస్తామని అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు.
తప్పుదోవ పడుతోన్న సీబీఐ విచారణ
సీబీఐ విచారణ తప్పుదోవ పడుతోందని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. సీబీఐ తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. కట్టు కథను అడ్డం పెట్టుకుని విచారణకు పిలుస్తున్నారని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. కీలక విషయాలు పక్కన బెట్టి తనను విచారిస్తున్నారన్నారు. సీబీఐ కూడా లీకులు ఇస్తోందని మండిపడ్డారు. మరోసారి కూడా విచారణకు రావాలని సీబీఐ అధికారులు తనకు చెప్పినట్లు పేర్కొన్నారు.
Read more:
Mp Avinash Reddy: తప్పుదోవ పడుతోంది.. సీబీఐ విచారణపై సంచలన వ్యాఖ్యలు