గిరిజనులకు సమాధానం చెప్పలేక.. పరారైనా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
రాష్టంలో ఇటీవలే బోయ వాల్మీకీలను గిరిజన తెగల్లో కలుపుతూ వైస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన అసెంబ్లీ తీర్మానంపై ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ గిరిజన సంఘాలు అడ్డుకుని సమాధానం చెప్పాలని
దిశ, బుట్టాయగూడెం : రాష్టంలో ఇటీవలే బోయ వాల్మీకీలను గిరిజన తెగల్లో కలుపుతూ వైస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన అసెంబ్లీ తీర్మానంపై ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ గిరిజన సంఘాలు అడ్డుకుని సమాధానం చెప్పాలని నిరంతరం కార్యక్రమాలు జరుగు తున్నాయి.శుక్రవారంసాయంత్రం మండల కేంద్రంలోని మసీద్ వద్ద ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన శాసన సభా కమిటీ చైర్మన్ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు అడ్డుకోగా వారికి సమాధానం చెప్పకుండానే అక్కడనుంచి వెళ్లిపోవడం పై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. బోయ వాల్మీకి గిరిజనుల కలపొద్దని,అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని,గిరిజన అన్యాయం చేసిన వైసీపీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీ తక్షణమే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే కార్యక్రమం పూర్తిచేసుకుని నిరసన తెలుపుతున్న వారికి కనీసం సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి హుటాహుటిన వెళ్లిపోయారు.సమాధానం చెప్పాలని ప్రతిఘటించిన గిరిజన సంఘం నాయకులను పోలీసులు పదేపదే అడ్డగిస్తూ కనీసం మాట్లాడకుండా నిలుపుదల చేశారు.దీనిపై ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి చెందిన బోయ వాల్మీకి బీసీ ఏ కులాలను గిరిజన తెగల్లో కలుపుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు తీరని అన్యాయం అన్నారు.ఏడు నియోజక వర్గాల్లో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించిన గిరిజనులకు వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని విమర్శించారు.గిరిజన తెగల్లో ఎవరినైనా కలపాల్చి వస్తే ఎస్ టీ కమిషన్, గిరిజన శాసన సభా కమిటీ, గిరిజన సలహా మండలి సమావేశంలో తీర్మానం ను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ కు తీర్మానం అందజేయాలనీ గిరిజన చట్టాలు చెబుతున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన శాసనసభ కమిటీ, గిరిజన సలహా మండలి సమావేశం జరపకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గిరిజన చట్టాలను హక్కుల్ని ఉల్లంఘిస్తూ అసెంబ్లీలో ఏకపక్ష నిర్ణయం చేయడం దుర్మార్గపు చర్య అన్నారు.తక్షణమే అసెంబ్లీ లో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలకు జాతి ముఖ్యమో పార్టీ పదవుల ముఖ్యమో తేల్చుకోవాలని హెచ్చరించారు.గిరిజనులకు అన్యాయం చేసే తీర్మానాన్ని ఎమ్మెల్యే ఎందుకు సమర్థించారని ఆయన ప్రశ్నించారు. గిరిజనులకు సమాధానం చెప్పకుండా ఎన్ని రోజులు ఎమ్మెల్యే పోలీసుల బందోబస్తులో తిరుగుతూ గిరిజనులు మోసం చేయొద్దన్నారు. గిరిజనులకు కనీసం సమాధానం చెప్పకుండా గిరిజనులకు విలువ కూడా ఇవ్వని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తక్షణమే పార్టీ, పదవులకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో మరిన్నిఆదివాసీ సంఘాలతో ఐక్య ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం మండల అధ్యక్షులు కారం భాస్కర్ నాయకులు కే దుర్గారావు, ఎం గంగరాజు,కుమారి,నాగమణి, లక్ష్మి పలువురు పాల్గొన్నారు.