Dwarampudi Chandrasekhar Reddy :తోక ముడిచి వెళ్తున్నారు: పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే సెటైర్
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, కాకినాడ సిటీ ఎమ్మె్ల్యే ద్వారంపూడి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డిని ఓడిస్తానని పవన్ శపథం చేయగా.. దమ్ముంటే పవన్ కల్యాణ్ నెక్ట్స్ ఎలక్షన్‌లో కాకినాడలో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చాలెంజ్ చేశారు. కాకినాడ నుండి వెళ్లిలోపు పవన్ కల్యాణ్ తన చాలెంజ్ స్వీకరించాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఇవాళ మరోసారి పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా చాలెంజ్‌కు పవన్ కల్యాణ్ స్పందించలేదని.. సవాల్ స్వీకరించకుండానే జనసేన అధినేత తోకముడిచి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లే పవన్ కల్యాణ్ ఆటలాడుతున్నారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో కులాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కులాల మధ్య చిచ్చు రేపాలని చూస్తున్నాడని ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు.
Read more :
వీధి రౌడీలా మాట్లాడొద్దు.. పవన్ కల్యాణ్‌పై ముద్రగడ తీవ్ర విమర్శలు