వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పార్థ సారథి

వాలంటీర్లను కొనసాగించాలా వద్దా అనే అంశాలపై నేడు కేబినెట్ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చించారు.

Update: 2024-09-18 11:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గాను వాలంటీర్ వ్యవస్తను తీసుకొచ్చింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాల్సిన ఈ వ్యవస్థ గాడితప్పిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ వ్యవస్థను ఎమ్ చేయాలి.. వాలంటీర్లను కొనసాగించాలా వద్దా అనే అంశాలపై నేడు కేబినెట్ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు, లేదా..మార్పుపై వచ్చే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వాలంటీర్లకు గుడ్ న్యూస్ అందించారు. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖలలో కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు కాకుండా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1.07 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. 2023లో వారి పదవీకాలం ముగిసినప్పటికీ రెన్యువల్ చేయలేదని అన్నారు.


Similar News