వైసీపీ హయాంలో రహదారులు విధ్వంసానికి గురయ్యాయి.. మంత్రి నిమ్మల తీవ్ర విమర్శలు
పాలకొల్లు నియోజకవర్గంలో ఆరు గ్రామాల్లో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు(శనివారం) శంకుస్థాపన చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: పాలకొల్లు నియోజకవర్గంలో ఆరు గ్రామాల్లో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు(శనివారం) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) మీడియాతో మాట్లాడుతూ.. గత జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రంలోని అన్ని రహదారులు విధ్వంసానికి గురయ్యాయి అని మండిపడ్డారు. ఈ క్రమంలో వచ్చే సంక్రాంతి నాటికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు(CM Chandrababu), పవన్ కళ్యాణ్‌ల(Deputy CM Pawan Kalyan) లక్ష్యమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం గా ఒకే రోజు రూ.815 కోట్లు చెల్లించిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు.
సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం(AP Government) పదివేల మంది నిర్వాసితులకు నష్టపరిహారం జమ చేసిందని తెలిపారు. 2017 లో సీఎం చంద్రబాబు హయాంలోనే నిర్వాసితుల ఖాతాలో రూ.800 కోట్లు జమ కాగా.. మళ్లీ నేడు పెద్ద మొత్తంలో జమయ్యాయి. పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల వరకు ఇస్తామని చెప్పి పైసా కూడా ఇవ్వకుండా మోసం మాజీ సీఎం జగన్(YS Jagan) మోసం చేశారన్నారు. అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పి నేడు మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గత వైసీపీ ప్రభుత్వం పాల్పడగా నేడు చంద్రబాబు పునర్నిర్మాణం చేస్తున్నారని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు.