AP Minister:‘ఆ కేసును కొట్టివేయండి’.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మంత్రి
ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. హాజరు నుంచి మినహాయింపుతో పాటు కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 2022 లో పాలకొల్లులో టిడ్కో ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడం లేదంటూ నిమ్మల నిరసన వ్యక్తం చేశారు.
అప్పుడు నిమ్మల రామానాయుడు, అతని అనుచరులు తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారని పాలకొల్లు వైసీపీ(YCP) ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా రామానాయుడుతో పాటు మరో 25 మందిపై 2022లో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై దర్యాప్తు పూర్తి చేసి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసును కొట్టివేయాలంటూ మంత్రి నిమ్మల హైకోర్టును ఆశ్రయించారు.