Amaravati : రాజధాని నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

రాజధాని నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు..

Update: 2024-11-04 10:29 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Ap Capital Amaravati) నిర్మాణ పనులపై మంత్రి నారాయణ(Minister Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పాత టెండర్లను రద్దు చేస్తూ సీఆర్‌డీఏ(CRDA) తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం రాజధాని నిర్మాణాలకు కట్టుబడి ఉందని తెలిపారు. రాజధానిపై అక్టోబర్ 31న కీలక నివేదికలు తన వద్దకు వచ్చాయని చెప్పారు. కొత్త టెండర్లు పిలించేందుకు లైన్ క్లియర్ అయినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని పనులు మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. డిసెంబర్ 31న కొత్త టెండర్లు ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. వరదనీటి నిర్వహణపై నెదర్లాండ్‌సంస్థ నివేదికకు ఆమోదం లభించిందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో వరద నీటి నిర్వహణకు మూడు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు


Similar News