Cabinet Sub Committee: ఏపీ రాజధాని నిర్మాణ పనులపై కీలక నిర్ణయం

ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2024-11-15 16:09 GMT
Cabinet Sub Committee: ఏపీ రాజధాని నిర్మాణ పనులపై కీలక నిర్ణయం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఏపీ రాజధాని భూముల(AP Capital lands)పై సుధీర్ఘంగా చర్చించిన మంత్రులు 2014-19 సమయంలో చాలా సంస్థలకు కేటాయింపులు జరిపినట్లు గుర్తు చేశారు. కానీ జగన్ ప్రభుత్వం(Jagan Government) పనులు నిలిపివేయడంతో ఆ తర్వాత ఎవరూ ముందుకు రాలేదని మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు. అమరావతి నిర్మాణ పనులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే ఆసక్తి చూపించాయని, ఈ మేరకు ప్రభుత్వాన్ని కలిశాయని పేర్కొన్నారు. ఈ నెల 18న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి రీ టెండరింగ్‌ను నిర్ణయిస్తామని చెప్పారు.

మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) మాట్లాడుతూ సీఆర్డీఏ(CRDA) పరిధిలో పనులు జరిగేకొద్ది మరిన్ని సంస్థలు వస్తాయని తెలిపారు. అమరావతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, వీటిపైనా కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించామని ఆయన చెప్పారు. ఇప్పటికే భూములు కేటాయించిన సంస్థలు ఏవి ఆసక్తి చూపుతున్నాయో వాటి పేర్లను పరిశీస్తున్నామని పయ్యావుల పేర్కొన్నారు. 

Tags:    

Similar News