Nara Lokesh: చాప్టర్ ఓపెన్ అయింది.. వారికి తప్పకుండా సినిమా చూపిస్తా

అమెరికా(America)లోని అట్లాంటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్(NTR) విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఆవిష్కరించారు.

Update: 2024-11-01 03:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లోని అట్లాంటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్(NTR) విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్‌బుక్‌లో రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా(Cinema) చూపిస్తా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెండో చాప్టర్‌తోనే ఆగిపోను.. అతి త్వరలోనే మూడో చాప్టర్ కూడా ఓపెన్ చేస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువగళం పాదయాత్ర సమయంలో నన్ను అనేక ఇబ్బందులకు గురిచేశారు.

రెడ్ బుక్‌కు భయపడి జగన్(Jagan) గుడ్ బుక్ తీసుకొస్తా అంటున్నాడు. ఆ బుక్‌లో ఏం రాయాలో అర్ధం కావడం లేదని చెబుతున్నారు’ అని లోకేష్(Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారమే లోకేష్ అమెరికా పర్యటన ముగిసింది. శుక్రవారం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరారు. పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలను వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్‌ను కోరారు లోకేశ్‌. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి సహకరించాలని రెవేచర్ సీఈవోకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News