వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. జగన్‌కు కూడా చెప్పేశా.. తేల్చేసిన ఏపీ మంత్రి
మంత్రి ధర్మాన ప్రసాదరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎ
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ధర్మాన ప్రసాదరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని విశ్రాంతి తీసుకుంటానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దంగా లేననే విషయాన్ని ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి తాను తీసుకెళ్లానని, కానీ ఈ ఒక్కసారి పోటీ చేయాల్సిందిగా ఆయన కోరారని అన్నారు. కానీ అవసరమైతే పార్టీ కోసం పనిచేస్తానని, కానీ పోటీకి సంబంధించి తనను వదిలేయాలని జగన్‌ను కోరినట్లు ధర్మాన తెలిపారు.
తాజాగా శ్రీకాకుళంలో ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాను రాజకీయాల్లో ఇక ఎక్కువ కష్టపడలేనని, నాలుగు దశాబ్ధాల పాటు కొనసాగానని తెలిపారు. చిన్న వయస్సుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, ఇప్పటివరకు 12 సార్లు పోటీ చేసినట్లు చెప్పారు. 40 ఏళ్లుగా పాలిటిక్స్‌లో కొనసాగుతున్నానని, ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచానని ధర్మాన పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములకు పెద్దగా తేడా ఉండదన్నారు. రాజకీయాల్లోకి లేకపోయినా ప్రజలకు మాత్రం సేవ అందిస్తానని, వారికి అండగా ఉంటానని అన్నారు.