Minister Bosta: ఏపీ,తెలంగాణ కలిస్తే తప్పేముంది?

తెలుగు రాష్ట్రాల విభజనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే మోస్ట్ వెల్ కమ్.. తప్పేం ఉందని ప్రశ్నించారు...

Update: 2022-12-08 12:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల విభజనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే మోస్ట్ వెల్ కమ్.. తప్పేం ఉందని ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం, హక్కుల సాధన కోసం వైసీపీ పోరాటం చేస్తూనే ఉందన్నారు. చంద్రబాబు డీఎన్ఏ ఏమిటో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. బడుగు, బలహీన వర్గాలను వెన్నుపోటు పొడవటమేనని విమర్శించారు. 'అమరావతిలో ఏం జరిగిందో చూశాం కదా.. చంద్రబాబు దోపిడీ వల్ల భూములు కోల్పోయింది, నష్టపోయింది ఆ వర్గాలే కదా?.' అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

READ MORE

NTR విగ్రహం తొలగింపు.. అచ్చెన్న తీవ్ర ఆగ్రహం 

Tags:    

Similar News