విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ఈజీ.. కానీ విలువలకు కట్టుబడి పోటీ చేయడం లేదు: హోంమంత్రి అనిత

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కూటమి నుంచి ఎవరిని పోటీ చేయిస్తారనే ఉత్కంఠకు చివరి నిమిషంలో షాక్ తగిలింది.

Update: 2024-08-13 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కూటమి నుంచి ఎవరిని పోటీ చేయిస్తారనే ఉత్కంఠకు చివరి నిమిషంలో షాక్ తగిలింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో సంప్రదించి.. పోటీకి దూరంగా ఉండాలని సూచించారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు సూచనకు విశాఖ పార్టీ నేతలు ఆమోదం తెలిపి ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై హోంమంత్రి అనిత స్పందించారు. తాము విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం చాలా సులభం కానీ.. విలువలకు కట్టుబడి ఉండి పోటీ చేయడం లేదని మీడియాతో చెప్పుకొచ్చారు. అలాగే తాము ఒకే చెబితే వైసీపీని వీడి కూటమిలో చేరేందుకు.. చాలా మంది సిద్ధంగా ఉన్నారని, కానీ తాము ఎవరిని పార్టీలో చేర్చుకోదల్చుకోలేదని.. మీడియాతో చెప్పుకొచ్చారు.


Similar News