‘బ్రో’ కలెక్షన్లపై మంత్రి అంబటి సెటైర్లు.. ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు-ప్యాకేజి స్టార్కి పాకెట్ ఫుల్లు అంటూ ట్వీట్

ఇటీవల రిలీజైన బ్రో సినిమా రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపింది. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ ను కించపరిచారంటూ రగిలిపోయిన ఏపీ మంత్రి ఆ మూవీ కలెక్షన్లపై సెటైర్లు వేశారు.

Update: 2023-08-01 10:35 GMT
‘బ్రో’ కలెక్షన్లపై మంత్రి అంబటి సెటైర్లు.. ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు-ప్యాకేజి స్టార్కి పాకెట్ ఫుల్లు అంటూ ట్వీట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల రిలీజైన బ్రో సినిమా రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపింది. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ ను కించపరిచారంటూ రగిలిపోయిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ఆ మూవీ కలెక్షన్లపై సెటైర్లు వేశారు. ‘ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు.. ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు’ అంటూ ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జులై 28న పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్ల పరంగా కొంత వెనుకబడింది. కాగా ఆ మూవీలో నటుడు పృథ్వీ శ్యాంబాబు అనే క్యారెక్టర్ చేశారు. ఈ పాత్రే అసలు రచ్చకు కారణం అయ్యింది. ఇందులో శ్యాంబాబు ఓ పాటకు డ్యాన్స్ చేస్తారు. అయితే, ఈ పాత్ర మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి పండుగకు చేసిన డ్యాన్స్‌ ను పోలి ఉందని వైసీపీ నాయకులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘బ్రో’ మూవీ నటులు, నిర్మాతలపై మండిపడ్డారు.  ఇదే అంశంపై ఇటీవలే అంబటి రాంబాబు స్పందించారు. పండగ సందర్భంగా తాను ఆనంద తాండవం చేస్తే, సినిమాలో తన క్యారెక్టర్ పెట్టి పవన్ కల్యాణ్ శునకానందం పొందారంటూ విమర్శించారు. “తన క్యారెక్టర్ కు సినిమాలో శ్యాంబాబు అని పెట్టడం ఎందుకు? నేరుగా రాంబాబు” అని పెడితే బాగుండేది కదా” అని నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలోనే బ్రో సినిమా కలెక్షన్లపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రొడ్యూసర్ కు నష్టం వచ్చిందని కానీ ప్యాకేజి స్టార్ కు మాత్రం లాభాలు వచ్చాయంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. 

Tags:    

Similar News