సీఎం జగన్ ఆ టైపు కాదు... లోకేశ్‌కు అమర్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన కుర్చి మడత పెట్టి వ్యాఖ్యలకు మంత్రి అమర్ నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు....
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన కుర్చి మడత పెట్టి వ్యాఖ్యలకు మంత్రి అమర్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్ నాలుక మడత పడిందని, ముందు దాన్ని సరిచేసుకోవాలని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ దెబ్బకు 2019 ఎన్నికల్లో చంద్రబాబు కుర్చీ మడత పడిందని ఆయన సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని మంత్రి అమర్నాథ్ జోస్యం చెప్పారు. విశాఖలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి కుర్చీ లాక్కునే టైపు సీఎం జగన్ కాదని తెలిపారు. తాము జగన్ వద్ద పని చేసే సైనికులమని తెలిపారు. సీఎం జగన్ అనుకుంటే ఎక్కడైనా కూర్చోబెడతారని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని మంత్రి అమర్‌నాథ్ ధీమా వక్తం చేశారు. 60 రోజుల్లో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్య భూమికి పోషించనున్నారని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు.