మెగా బ్రదర్ నాగబాబుకు టికెట్ ఉందా లేదా..?
మెగా బ్రదర్ నాగాబుకు ఈ సారి టికెట్ ఉందా...?. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు..?...
దిశ, వెబ్ డెస్క్: మెగా బ్రదర్ నాగాబుకు ఈ సారి టికెట్ ఉందా...?. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు..? అసలు టికెట్ ఇవ్వడం లేదా.?. ఇవ్వకపోతే ఎందుకు..?. ఆసలు ఆయన పోటీ చేస్తారా లేదా..? అనేది ఇప్పుడు సంశయమంగా మారింది. నిన్న, మొన్నటి వరకూ నాగాబాబు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం నిజంకాదని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో తళుక్కున మెరిసే ఆయన వారం రోజులు నుంచి కనిపించడం లేదని జనసేన కార్యకర్తలు అంటున్నారు. అనకాపల్లిలోనే నివాసం ఏర్పాటు చేసుకుంటానని చెప్పిన నాగబాబు సడెన్‌గా హైదరాబాద్ ఫిష్ట్ కావడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జనసేన అభ్యర్థుల రెండో లిస్టుపై కసరత్తు జరుగుతోంది. ఈ లిస్టులో 10 మంది అభ్యర్థులను పవన్ కల్యాన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ లిస్టులో కూడా నాగబాబు పేరు లేదనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన అభ్యర్థిత్వంపై చేసిన సర్వేల్లో నెగిటివ్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన సీటుపై పవన్ కల్యాణ్ మౌనం వహిస్తున్నారని అంటున్నారు. దీంతో నాగబాబు సీటుపై క్లారిటీగా చెప్పలేని పరిస్థితి ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి అన్న సీటుపై జనసేనాని వ్యూహం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి నుంచి కాకపోతే వేరే చోట నుంచైనా నాగబాబుతో పోటీ చేయిస్తారా.., ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారా..?. లేదంటే ఈసారికి పార్టీ ప్రధాన కార్యదర్శిగానే ఉండిపోతారా అనేది త్వరగా తేల్చాలని జనసేన నేతలు, కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.
మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైతే కొన్ని సీట్లు కాషాయ పార్టీ నేతలకు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లలో జనసేనకు ఎన్ని వస్తాయనే దానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన తొలి విడత అభ్యర్థుల లిస్టును విడుదల చేశాయి. టీడీపీ- 94, జనసేనకు 24 సీట్లు కేటాయించారు. ఇక 57 సీట్లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఈ సీట్లలో బీజేపీకి పోను జనసేనకు ఎన్ని వస్తాయో చూడాల్సి ఉంది. అందులో నాగాబాబు పేరు ఉంటుందేమో చూడాలి. లేకపోతే ఈసారికి నాగబాబు పార్టీ విజయం కోసం కృషి చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...?.