ఏపీ నుంచి బెంగాల్ వెళ్లే లారీలు 3 రోజుల పాటు బంద్.. ఎందుకంటే..?
ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11(రేపటి) నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు పంపవద్దని అసోసియేషన్ తెలిపింది.
దిశ, వెబ్ డెస్క్: ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11(రేపటి) నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు పంపవద్దని అసోసియేషన్ తెలిపింది. ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజులపాటు పశ్చిమ బెంగాల్‌లో అక్కడి అసోసియేషన్‌లు లారీల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఈ బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మూడు రోజుల పాటు ఏపీ నుంచి బెంగాల్ కు లారీలు పంపవద్దని నిర్ణయించింది. కాగా ఈ బంద్ ప్రభావంతో ఏపీ, బెంగాల్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా నిత్యావసరాల సరుకుల పై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.