Kurnool: మంత్రాలయం బ్రిడ్జి కం రిజర్వాయర్‌కు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్, కర్ణాటకను అనుసంధానం చేయడానికి తుంగభద్ర నదిపై ఏర్పాటు చేసే బ్రిడ్జ్ కం రిజర్వాయర్‌కు లైన్ క్లియర్ అయింది.....

Update: 2024-09-12 07:33 GMT

దిశ, మంత్రాలయం: ఆంధ్రప్రదేశ్, కర్ణాటకను అనుసంధానం చేయడానికి తుంగభద్ర నదిపై ఏర్పాటు చేసే బ్రిడ్జ్ కం రిజర్వాయర్‌కు లైన్ క్లియర్ అయింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి పంచముఖి వెళ్లే మార్గంపై రాకపోకలు సాగించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో తాజాగా కర్నూలు జిల్లా R&B గెస్ట్ హౌస్‌లో చర్చలు కొనసాగాయి. ఈ చర్చల్లో కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ బోసరాజు, రాయచూర్ ఎంపీ కుమార్ నాయక్, కర్నూల్ ఎంపీ పంచాలింగల నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, కర్నూల్, రాయచూర్ జిల్లాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.


ఈ సమావేశానంతరం మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ కట్టబోతున్న రిజర్వాయర్ నుంచి ఎక్కువ సాగునీరు మంత్రాలయం రైతులకు ఇవ్వాలని కర్ణాటక ఇరిగేషన్ మంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గ కరువును, వలసలను తగ్గించాలన్నారు. ప్రజలకు తాగు, సాగునీరు అందించే విధంగా రిజర్వాయర్ నుంచి కాలువలను స్పష్టంగా డిసైన్ చేయాలని ఎన్.రాఘవేంద్ర రెడ్డి కోరారు.


Similar News