Kurnool: సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామంలో పర్యటించనున్నారు....
దిశ, కర్నూలు ప్రతినిధి: ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేసి సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు కలిసికట్టుగా పని చేస్తున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పా్ట్లను కర్నూలు జేసీ నారపురెడ్డి మౌర్య, ఎస్పీ జి.కృష్ణకాంత్ తో కలిసి కర్నూలు జిల్లా కలెక్టర్ జి.సృజన పర్యవేక్షించి మాట్లాడారు.
లక్కసాగరం పంప్ హౌస్ నుంచి 77 చెరువులకు నీరందించే పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. హెలిప్యాడ్‌లో కొనసాగుతున్న పనులను పరిశీలిస్తూ పెండింగ్‌లో ఉన్న హెలిప్యాడ్ పనులు నేటిలోపు పూర్తి చేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి వేదిక స్థలం వరుకు భారీకేడింగ్ పనులు సరిగా చేయించాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ వెలింగ్ ప్యాచింగ్ పనులు కూడా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేదిక వద్ద గ్రీన్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పంప్ హౌజ్ భవనాన్ని ఆకట్టుకునే రీతిలో డెకరేషన్ చేయాలని ఇంచార్జి ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. పైలన్ ప్రారంభించే ప్రదేశంలో పెండింగ్‌లో ఉన్న పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సంబంధిత పనుల గురించి సమాచారం ఇస్తూ ఉండాలని జిల్లా పరిషత్ సీఈఓకు సూచించారు. అదే విధంగా రోడ్డు మార్గంలో ఇరువైపులా తొలగించిన పిచ్చి మొక్కలను తీసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీపీఓను కలెక్టర్ ఆదేశించారు.