AP News:ఇంటి వద్దకే పెన్షన్..సంతోషంలో లబ్దిదారులు!

కల్లూరు మండలం, చిన్నటేకూరు గ్రామం, కృష్ణ నగర్ నివాసిని నా పేరు వరలక్ష్మి, నా భర్త కొన్ని సంవత్సరాల కిందట మరణించడం జరిగిందని

Update: 2024-08-01 10:29 GMT

దిశ ప్రతినిధి,కర్నూలు:కల్లూరు మండలం, చిన్నటేకూరు గ్రామం, కృష్ణ నగర్ నివాసిని నా పేరు వరలక్ష్మి, నా భర్త కొన్ని సంవత్సరాల కిందట మరణించడం జరిగిందని అప్పటి నుండి ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగించే దానినని కొంత కాలం నుండి ఆరోగ్యం బాగాలేక ఇంటి వద్దనే ఉంటూ పనులకు వెళ్లడం లేదని, గతంలో ఇచ్చే పెన్షన్ వైద్యం చేయించుకోవాలన్నా, మెడిసిన్ కొనాలన్న సరిపోయేది కాదని అటువంటి తరుణంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచి నేరుగా ఇంటి వద్దకే స్వయంగా కలెక్టర్ గారే వచ్చి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దిక్కులేనివారికి దేవుడయ్యాడు అన్నారు.

ఆర్థిక సమస్యలు తీరుతాయి..

నా పేరు రామాంజనేయులు, కల్లూరు మండలం, చిన్నటేకూరు గ్రామం, కృష్ణ నగర్ నివాసిని నాకు ఒక్క కొడుకు ఉన్నాడని అతడు వృత్తిరీత్యా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, కానీ అతనికి వచ్చిన సంపాదనతో కుటుంబ పోషణ, మందులు, నిత్యావసర సరుకులకు డబ్బులు సరిపడక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళమని, ఇటువంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 4 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో ఆర్థికంగా కొన్ని సమస్యలు తీరుతాయన్నారు.

జీవితానికి ఎంతో భరోసా

నా పేరు మస్తాన్ బి కల్లూరు మండలం, చిన్నటేకూరు గ్రామం, కృష్ణ నగర్ నివాసిని పెంచిన 4 వేల రూపాయల పెన్షన్ మాలాంటి నిరుపేదలకు బతుకు మీద ఆశను కలిగించడమే కాక జీవితానికి ఎంతో భరోసాగా ఉంటుందన్నారు. ఈ వయసులో ఎలా బతకాలో అర్థం కాని సమయంలో వితంతువులకు భరోసాగా నేనున్నానంటూ పెన్షన్ పెంచి ఇవ్వడం నిజంగా అదృష్టం అని ఆ డబ్బుతో ఒకరి మీద ఆధారపడకుండా సంతోషంగా జీవనం సాగించవచ్చునన్నారు.


Similar News