Srisailam Reservoir:శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్‌లో గుర్రపు డెక్క
శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్‌లో భారీగా గుర్రపు డెక్క కొట్టుకొస్తుంది.
దిశ,శ్రీశైలం ప్రాజెక్ట్:శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్‌లో భారీగా గుర్రపు డెక్క కొట్టుకొస్తుంది. దాన్ని చూడగానే విస్తరించుకుంది. ఆ వరదతో పాటు ఎగువ కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి ఈ గుర్రపు డెక్క వరద ప్రవాహానికి కొట్టుకొని బ్యాక్ వాటర్ లో చేరింది. జలాశయంలో భారీగా గుర్రపు డెక్క విస్తరించుకుంటుంది. అయితే త్వరితగతిన ఈ గుర్రపు డెక్క తొలగించకుంటే గుర్రపు డెక్క ఆకులు కుళ్లిపోయి వరద నీరు కలుషితం అయ్యే ప్రమాదముంది. జలాశయంలోని చేపలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ గుర్రపు డెక్క పూర్తిస్థాయిలో విస్తరించక ముందే తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు.