లాటరీలో మద్యం దుకాణం పొందిన వ్యాపారి కిడ్నాప్
ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో మద్యం దుకాణం పొందిన ఓ వ్యాపారి కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపుతోంది.
దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో మద్యం దుకాణం పొందిన ఓ వ్యాపారి కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపుతోంది. కొత్త మద్యం పాలసీ నేపథ్యంలో ఏపీలో నేడు 3,396 మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. అయితే ఈ లాటరీలో మద్యం దుకాణం పొందిన సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలానికి చెందిన ఓ మద్యం వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. పుట్టపర్తిలో నిర్వహించిన లాటరీలో మద్యం దుకాణం గెలుచుకున్న సదరు వ్యాపారి బయటికి రాగానే అపహరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.